బాసరలో ఘనంగా గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

రిపోర్టర్: హరి స్థలం: నిర్మల్

నిర్మల్ జిల్లా బాసరలో మంత్రి జూపల్లి కృష్ణారావు గోదావరి పుష్కరాల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. రాబోయే పుష్కరాలను అత్యంత వైభవోపేతంగా నిర్వహించేందుకు రూ.20 కోట్లతో ఘాట్ల నిర్మాణం, రూ.354 కోట్లతో బాసర సరస్వతి ఆలయ సమగ్ర అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. భక్తుల భద్రత, మౌలిక వసతులు, పారిశుద్ధ్యంపై అధికారులతో సమీక్ష నిర్వహించి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.