మెడలో చిన్న వాపును నిర్లక్ష్యం చేస్తే ముప్పు తప్పదని హెచ్చరిక
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తెలంగాణ
మెడలో చిన్న వాపు, గొంతు బొంగురుపోవడం వంటి లక్షణాలను సాధారణ ఒత్తిడి లేదా వయసు ప్రభావంగా భావించి నిర్లక్ష్యం చేయకూడదని అపోలో హాస్పిటల్స్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ కరణ్ గుప్తా స్పష్టం చేశారు. థైరాయిడ్ సమస్యలు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తాయని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవడం ద్వారా ప్రాణాంతక వ్యాధుల ముప్పును ముందుగానే నివారించవచ్చని ఆయన పేర్కొన్నారు.