స్థానిక ఎన్నికలపై వైఎస్సార్సీపీ కోడూరు మండల విస్తృత సమావేశం

రిపోర్టర్: k. siva prasad స్థలం: చిట్వేల్

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో చిట్వేల్ మండలం రైల్వేకోడూరులో వైఎస్సార్సీపీ మండల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఎన్నికల సన్నద్ధత, పార్టీ కార్యకలాపాల విస్తరణపై చర్చించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తామని, గ్రామస్థాయిలో నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.