అనుమతులు లేకుండానే నల్లమట్టి తవ్వకాలు మరియు నిల్వలు
రిపోర్టర్: రాము
స్థలం: యాదాద్రి భువనగిరి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని మోటకొండూరు, ఆత్మకూరు మండలాల్ లో నల్లమట్టి తవ్వకాలు, నిల్వలు వివాదాస్పదంగా మారుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నట్లు సమాచారం. కాటేపల్లి, సర్వేపల్లి గ్రామాల్ లో ఇటుక బట్టీల వద్ద భారీగా మట్టి నిల్వలు ఏర్పాటు చేశారని, ఇతర రాష్ట్రాల నుంచి వలస కూలీలను రప్పించి శ్రమదోపిడీకి పాల్పడుతున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇంత జరుగుతున్నా సంబంధిత శాఖల అధికారులు స్పందించకపోవడంపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయని స్థానికులు వాపోతున్నారు.