డిసెంబర్ లో అమెరికాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన
రిపోర్టర్: రమేష్
స్థలం: India
ఈ ఏడాది డిసెంబర్ 14, 15 తేదీల్లో అమెరికాలోని ఫ్లోరిడా వేదికగా జరగనున్న జీ20 దేశాధినేతల సదస్సులో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆతిథ్యమిస్తున్న ఈ సదస్సులో పాల్గొనడంతో పాటు ద్వైపాక్షిక చర్చలు జరిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. అమెరికా పర్యటన ముగిసిన వెంటనే కెనడాలోనూ పర్యటించే అవకాశాలున్నట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.