జన్నారంలో ఎరువుల దుకాణాలపై విరుచుకుపడ్డ వ్యవసాయ శాఖ అధికారులు

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండల కేంద్రంలోని ఎరువులు మరియు విత్తనాల దుకాణాలను వ్యవసాయ అధికారులు సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణాల్లో స్టాక్ రిజిస్టర్లను పకడ్బందీగా నిర్వహించాలని వ్యాపారులకు సూచించారు. ఈపాస్ యంత్రాల ద్వారానే రైతులకు ఎరువులు పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. విక్రయాల్లో పూర్తి పారదర్శకత పాటించి అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారుల బృందం హెచ్చరించింది.