సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసుల హెచ్చరిక
రిపోర్టర్: గోపి
స్థలం: అన్నమయ్య
లాటరీ తగిలిందంటూ వచ్చే నకిలీ సందేశాలు మరియు ఫేక్ లింక్ ల పట్ల ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. సైబర్ నేరాల బారిన పడి డబ్బులు కోల్పోవద్దని హెచ్చరించారు. ఎవరైనా మోసానికి గురైతే వెంటనే 1930 నంబర్ కు లేదా cybercrime.gov.in వెబ్ సైట్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రజల భద్రత కోసం సైబర్ క్రైమ్ విభాగం ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.