మహిళలను వేధిస్తున్న ఉన్నత విద్యావంతులైన ఆకతాయిలపై షీ టీమ్స్ నిఘా
రిపోర్టర్: భాస్కర్
స్థలం: హైదరాబాద్
నగరంలో రద్దీ ప్రాంతాల్లో మహిళలతో అనుచితంగా ప్రవర్తిస్తున్న ఉన్నత విద్యావంతులు, ఉద్యోగులపై షీ టీమ్స్ ప్రత్యేక నిఘా ఉంచినట్లు నగర మహిళా భద్రత విభాగం డీసీపీ డాక్టర్ లావణ్యనాయక్ జాదవ్ వెల్లడించారు. ఆకతాయిల చేష్టలను రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని కౌన్సెలింగ్ ఇస్తున్నామని, ఉద్యోగుల సమాచారాన్ని వారి సంస్థలకు అందజేయడంతో ఈ ఏడాది పది మంది కొలువులు కోల్పోయారని తెలిపారు. బాధితులు భయపడకుండా ధైర్యంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేయాలని ఆమె సూచించారు.