మోహన్‌లాల్ పాన్ ఇండియా చిత్రం 'ఆపరేషన్ గంగా' టైటిల్ ప్రకటన
రిపోర్టర్: విజయ్
స్థలం: World
సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా విష్ణు మోహన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం 'ఆపరేషన్ గంగా'. ఉక్రెయిన్-రష్యా యుద్ధం నేపథ్యంలో భారత్ చేపట్టిన చారిత్రాత్మక ఎవాక్యుయేషన్ మిషన్ ఆధారంగా ఈ సినిమా రూపొందుతోంది. శ్రీ గోకులం మూవీస్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అర్జున్ రాంపాల్, అదిల్ హుస్సేన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జార్జియాలో షూటింగ్ ప్రారంభమైంది, 180 రోజుల పాటు పలు దేశాల్లో చిత్రీకరణ జరగనుంది.