భూభారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలని సీసీఎల్ఏ లోకేష్ కుమార్ వార్నింగ్

రిపోర్టర్: R.RAVINDER స్థలం: మంచిర్యాల

భూముల రీ సర్వే, భూభారతి పెండింగ్ దరఖాస్తుల పరిష్కారం వేగవంతం చేసి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని భూ పరిపాలన ప్రధాన కమిషనర్ లోకేష్ కుమార్ అన్నారు. మంగళవారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఈ ఆదేశాలు జారీ చేశారు.