ఆధ్యాత్మిక చిత్రంగా జయహో రామానుజ: ఈ నెల 24న విడుదల

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

కులమతాలకు అతీతంగా మనుషులంతా ఒక్కటే అని చాటిన మహనీయుడు రామానుజాచార్యుల జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన ఆధ్యాత్మిక చిత్రం జయహో రామానుజ అని నటుడు, దర్శకుడు డాక్టర్ సాయివెంకట్ వెల్లడించారు. సుదర్శనం ప్రొడక్షన్స్ పతాకంపై సాయిప్రసన్న, ప్రవళ్లిక నిర్మించిన ఈ సినిమా ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో బుధవారం నిర్వహించిన ప్రీరిలీజ్ వేడుకలో చిత్ర యూనిట్ పాల్గొని సినిమా విశేషాలను పంచుకున్నారు.