రాష్ట్రంలో ఉద్యోగుల డీఏ పెంపుపై నేడు మంత్రివర్గ భేటీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో నేడు రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం ప్రారంభమయ్యే ఈ భేటీలో దసరా కానుకగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు రెండు డీఏలు విడుదల చేసే అంశంపై కీలక నిర్ణయం తీసుకోనున్నారు. నిషేధిత భూముల జాబితా, సాగునీటి ప్రాజెక్టులతో పాటు పలు సంక్షేమ పాలనాపరమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నట్లు అధికారులు తెలిపారు.