హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ మేనల్లుడు దుర్మరణం
రిపోర్టర్: సునీల్
స్థలం: Jalandhar
పంజాబ్ లోని జలంధర్ లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రముఖ సింగర్ యో యో హనీ సింగ్ మేనల్లుడు విదిత్ ఔలుక్ ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఈ దుర్ఘటనలో విదిత్ తో పాటు అతని స్నేహితుడు ఆరవ్ తల్వార్ కూడా మృతి చెందారని పేర్కొన్నారు. ఈ విషాద ఘటనపై హనీ సింగ్ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.