రోడ్డు భద్రతపై కలెక్టరేట్లో అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష

రిపోర్టర్: వెంకట్ స్థలం: మహబూబాబాద్

మహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్, జిల్లా ఎస్పీ డాక్టర్ శబరిష్తో కలిసి రోడ్డు భద్రత మరియు ప్రమాదాల నివారణపై పలు శాఖల అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించినట్లు కలెక్టర్ మహబూబాబాద్ (Collector Mahabubabad) వెల్లడించారు. ఈ సమావేశంలో పోలీస్, ఆర్ అండ్ బి, రవాణా, నేషనల్ హైవేస్, పంచాయతీ రాజ్ అలాగే మున్సిపల్ శాఖల అధికారులు పాల్గొని రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన కట్టుదిట్టమైన చర్యలపై సుదీర్ఘంగా చర్చించారు.