నన్ను ఫేక్ అంటావా అంటూ జగన్‌పై శివనాగిరెడ్డి తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాము స్థలం: Andhra Pradesh

కేంద్ర ప్రభుత్వమే తన క్రీడా ప్రతిభను గుర్తించి రైల్వే మరియు ఇన్ కం టాక్స్ విభాగాలలో ఉద్యోగం ఇచ్చిందని శివనాగిరెడ్డి స్పష్టం చేశారు. ఏషియన్ ఛాంపియన్ షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తనను ఫేక్ అంటారా అంటూ ఆయన జగన్‌ను నిలదీశారు. క్రీడాకారులను, ఉపాధ్యాయులను అవమానిస్తే తగిన గుణపాఠం చెబుతామని శివనాగిరెడ్డి తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.