డిపాజిటర్లకు భారీ ఊరట: నెల్లూరులో ముమ్మరంగా అగ్రిగోల్డ్ బాండ్ల పరిశీలన

రిపోర్టర్: Siddu స్థలం: నెల్లూరు అర్బన్

అగ్రిగోల్డ్ డిపాజిటర్లకు న్యాయం చేసేందుకు ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. నెల్లూరు నగరంలోని ఉమేష్ చంద్ర కాన్ఫరెన్స్ హాలులో రూ.20 వేలకుపైగా డిపాజిట్ చేసిన బాధితుల బాండ్లు, ధ్రువపత్రాల పరిశీలన కార్యక్రమం ప్రారంభమైంది. సీఐడీ ఏఎస్పీ శిరీష, డీఎస్పీ కోటారెడ్డి పర్యవేక్షణలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. తొలిరోజు వెంకటాచలం మండలానికి చెందిన 52 మంది బాధితులకు సంబంధించిన 90 బాండ్లను అధికారులు నిశితంగా పరిశీలించి ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. బాధితులకు త్వరలోనే చెల్లింపులు జరుగుతాయని అధికారులు స్పష్టం చేశారు.