కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రకు తొలిసారిగా రైలులో కలప గుజ్జు రవాణా

రిపోర్టర్: మహేష్ స్థలం: కాకినాడ

కాకినాడ పోర్టు నుంచి మహారాష్ట్రలోని భిగ్వాన్‌కు తొలిసారిగా కలప గుజ్జు లోడుతో రైలు శనివారం బయలుదేరింది. ఇప్పటిదాకా రోడ్డు మార్గంలో రవాణా అవుతున్న కలప గుజ్జును రైలు మార్గానికి మళ్లించడం రైల్వే రవాణాలో సరికొత్త మైలురాయిగా నిలిచిందని దక్షిణ కోస్తా రైల్వే అధికారులు తెలిపారు. రైల్వే బోర్డు ఛార్జీలను గణనీయంగా తగ్గించడంతో పరిశ్రమల ప్రతినిధులు రైలు రవాణా వైపు మొగ్గు చూపారు.