ఎల్‌నినో ముప్పుపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు: ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
తెలంగాణలో ఎల్‌నినో ప్రభావ పరిస్థితులను పర్యవేక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఒక మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేసినట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ సబ్‌కమిటీకి ఛైర్మన్‌గా ఆయన వ్యవహరించనుండగా, పలువురు మంత్రులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. ఎండల తీవ్రత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు విద్యుత్, నీటిని పొదుపుగా వాడుకోవాలని పిలుపునిచ్చారు. వరి సాగుకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేయాలని సీఎం రేవంత్ రెడ్డి రైతులకు సూచించారు.