టీచర్లకు అలర్ట్: ప్రత్యేక టెట్ నోటిఫికేషన్ విడుదల చేసిన విద్యాశాఖ
రిపోర్టర్: అశోక్
స్థలం: హైదరాబాద్
ఇన్ సర్వీస్ టీచర్ల కోసం ప్రత్యేక టెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు నవీన్ నికోలస్ వెల్లడించారు. ఈ ప్రత్యేక ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఈనెల 7 నుంచి 16వ తేదీ వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. నవంబర్ 16 నుంచి 21 వరకు ఆన్ లైన్ పరీక్షలు నిర్వహించి, డిసెంబర్ 9 నుంచి 11 మధ్య ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఆయన స్పష్టం చేశారు.