రైల్వే ప్రయాణికులకు షాక్: దసరా సెలవుల్లో భారీగా వెయిటింగ్ లిస్ట్

రిపోర్టర్: నరేష్ స్థలం: Hyderabad

దసరా సెలవుల్లో స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికులకు తీవ్ర నిరాశ ఎదురవుతోందని, ప్రధాన రైళ్లలో భారీగా వెయిటింగ్ లిస్ట్ కనిపిస్తోందని అధికారులు తెలిపారు. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే రైల్వే రిజర్వేషన్లు పూర్తిగా నిండిపోయాయని, టికెట్లు దొరక్క ప్రయాణికులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీ ద్వారా ఏడు వేల ప్రత్యేక బస్సులను నడిపేందుకు ఏర్పాట్లు చేసిందని స్పష్టం చేశారు.