అమరావతి రాజధాని అభివృద్ధికి రూ.2,850 కోట్లు కేటాయించిన ఏపీ కేబినెట్

రిపోర్టర్: రమేష్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధాని అమరావతి మౌలిక వసతుల కల్పనకు రూ.2,850 కోట్లకు పైగా నిధుల అంచనా ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కొత్తగా నాలుగు ప్రధాన నగరాల్లో పోలీస్ కమిషనరేట్ల ఏర్పాటుతో పాటు ఐటీ మరియు క్వాంటం టెక్నాలజీ రంగాలలో భారీ పెట్టుబడులకు మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.