అమెరికాలో ఉత్కంఠగా మధ్యంతర ఎన్నికల పోలింగ్: బారులు తీరిన ఓటర్లు

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Washington

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాలనకు రెఫరెండంగా భావిస్తున్న మధ్యంతర ఎన్నికల పోలింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా కొనసాగుతోందని అంతర్జాతీయ మీడియా వర్గాలు వెల్లడించాయి. అనేక రాష్ట్రాల్ లో ఉదయం ఆరు గంటల నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరినట్లు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఇప్పటికే ముగిసిన ముందస్తు ఓటింగ్ లో పోలింగ్ శాతం గణనీయంగా పెరిగినట్లు అధికారులు తెలిపారు.