ఏపీకి రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి: మంత్రి కొండపల్లి

రిపోర్టర్: రాజేష్ స్థలం: విశాఖపట్నం

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌కు రూ.24 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విశాఖలో జరిగిన ఏపీ ఛాంబర్స్ ఎక్స్‌పో ముగింపు వేడుకల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తూ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నట్లు స్పష్టం చేశారు.