కుప్పంలో రూ.38 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

రిపోర్టర్: సతీష్ స్థలం: కుప్పం

కుప్పం మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ.38 కోట్ల విలువైన ప్రభుత్వ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.