పేదల కన్నీటికి విలువ లేదంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వ్యాఖ్య

రిపోర్టర్: గోపి స్థలం: ఖమ్మం

పేదల కన్నీటికి విలువ కట్టలేమని, వారి ఆనందానికి వెల కట్టలేమని మంత్రి, పాలేరు ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ మహానగరంలో తమకంటూ ఒక సొంతిల్లు వచ్చిందన్న ఆనందంతో లబ్ధిదారులు మాట్లాడుతున్నప్పుడు వారి కళ్లలో కనిపించిన సంతోషాన్ని, మాటల్లోని భావోద్వేగాన్ని స్వయంగా చూశానని ఆయన వెల్లడించారు. పేదరికంలో బతుకుతున్న తమకు సొంతింటి కల నెరవేరిందంటూ లబ్ధిదారులు వ్యక్తం చేసిన ఆనందం తనను ఎంతగానో కదిలించిందని మంత్రి తెలిపారు.