హైదరాబాద్లో ఘనంగా పోతిరెడ్డిపల్లి మూవీ ప్రారంభం: పూజా కార్యక్రమాలతో షురూ

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

చాక్లెట్ స్టార్ పవన్ హీరోగా నటిస్తున్న హారర్ మిస్టర్ థ్రిల్లర్ చిత్రం పోతిరెడ్డిపల్లి హైదరాబాద్లోని రామానాయుడు స్టూడియోస్లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఆరాధ్య క్రియేషన్స్ బ్యానర్పై జేరమ్ విష్ణు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అశోక్ రోయ్య దర్శకత్వం వహిస్తున్నారు. మౌనిక, సిరి హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరై చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. పల్లెటూరి వాతావరణం, ఆసక్తికరమైన మలుపులతో ఈ సినిమా తెరకెక్కనున్నట్లు మేకర్స్ స్పష్టం చేశారు.