టెక్ రంగంలో కలకలం: అమెజాన్ సంస్థలో మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపు
రిపోర్టర్: విజయ్
స్థలం: హైదరాబాద్
అంతర్జాతీయ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ మరోసారి ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను ప్రారంభించిందని ఆర్థిక నిపుణులు తెలిపారు. రీటైల్ బిజినెస్ పరిధిలోని వివిధ విభాగాలపై ప్రభావం పడగా, ప్రపంచవ్యాప్తంగా వెయ్యి మందికి పైగా వైట్-కాలర్ ఉద్యోగులు ఉపాధి కోల్పోయినట్లు సమాచారం. భారత్, అమెరికా, బ్రిటన్ దేశాల్లోని ఉద్యోగులపై ఈ లేఆఫ్స్ నేరుగా పడ్డాయని, కృత్రిమ మేధస్సు రంగానికి నిధులను మళ్లించే క్రమంలోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.