కొనిజర్ల వద్ద కల్వర్టులోకి దూసుకెళ్లిన ఆయిల్ ట్యాంకర్ ప్రాణాలతో బయటపడ్డ ఇద్దరు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కొనిజర్ల

ఖమ్మం జిల్లా కొనిజర్ల మండలం రాంపురం సమీపంలో రాత్రి పామ్ ఆయిల్ ట్యాంకర్ అదుపుతప్పి కల్వర్టులో పడిపోయింది. అంజనాపురం పామ్ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆయిల్ నింపుకుని వస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును తప్పించే క్రమంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ట్యాంకర్ డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడినట్లు సమాచారం అందుతోంది. మహారాష్ట్రకు చెందిన ఈ ట్యాంకర్ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.