న్యూజిలాండ్ ఏ జట్టుతో మ్యాచ్: తడబడుతున్న భారత్ ఏ జట్టు

రిపోర్టర్: సునీల్ స్థలం: Christchurch

న్యూజిలాండ్ ఏ జట్టుతో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో భారత్ ఏ జట్టు బ్యాటింగ్లో తడబడుతోంది. క్రైస్ట్చర్చ్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్లో టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయింది. ఓపెనర్ యశస్వీ జైస్వాల్ డకౌట్ కాగా, దేవదత్ పడిక్కల్ అర్ధ సెంచరీతో రాణించాడు. సాయి సుదర్శన్ పర్వాలేనిపించగా, మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో మొదటి రోజు ఆటలో భారత జట్టు ఐదు వికెట్లు కోల్పోయి 163 పరుగులు చేసిందిని క్రీడా వర్గాలు తెలిపాయి.