తెలంగాణను హెల్త్ ఇన్నోవేషన్స్ కేంద్రంగా తీర్చిదిద్దుతామన్న మంత్రి శ్రీధర్‌బాబు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

దేశంలోనే హెల్త్ ఇన్నోవేషన్స్‌కు ప్రధాన కేంద్రంగా తెలంగాణను తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. హైదరాబాద్‌లోని టీ-హబ్ లో హోమా సీఎంఈ 2026 జాతీయ సదస్సును సోమవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వైద్య రంగంలో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహిస్తామని, ప్రభుత్వ ఆసుపత్రుల రోగులకు ఉచిత ప్రోటోకాల్ అందిస్తామని స్పష్టం చేస్తూ మెట్రిక్ ఎక్స్ ప్లోరర్ యాప్‌ను ఆవిష్కరించారు.