భక్తిశ్రద్ధలతో ఘనంగా బాలల వినాయకుని విగ్రహ నిమజ్జనం

రిపోర్టర్: Gangadhar Reporter స్థలం: జన్నారం

మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పొనకల్ గ్రామపంచాయతీ పరిధిలోని 10వ వార్డులో బాలల వినాయకుని విగ్రహ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. పాలకవర్గం ఉపసర్పంచ్ అప్పల జలపతి గారి ఆధ్వర్యంలో భక్తిశ్రద్ధలతో పూజలు చేసి విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమంలో బాలలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమం ప్రశాంత వాతావరణంలో కొనసాగింది.