అఫ్గానిస్తాన్‌పై ఘనవిజయంతో సరికొత్త రికార్డు సృష్టించిన టీమిండియా

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: India

అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడో టీ20 మ్యాచ్‌లో భారత క్రికెట్ జట్టు 127 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించి రికార్డు సృష్టించింది. మెన్స్ T20I చరిత్రలో 100 అంతకంటే ఎక్కువ పరుగుల మార్జిన్‌తో అత్యధికంగా 10 సార్లు విజయాలు నమోదు చేసిన తొలి ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌గా భారత్ నిలిచింది. పవర్ ప్లే నుంచి ఆఖరి ఓవర్ వరకు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అఫ్గాన్‌ను చిత్తు చేసిన టీమిండియా, పొట్టి ఫార్మాట్‌లో తమ ఆధిపత్యాన్ని ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.