సంక్షేమ కార్యక్రమాల కన్వర్జెన్స్పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష
రిపోర్టర్: అశోక్
స్థలం: Andhra Pradesh
పేదల సేవలో సంక్షేమ కార్యక్రమాల అమలుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు కీలకమైన జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ ఉన్నత స్థాయి సమావేశానికి రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, వివిధ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు అలాగే పలువురు ఉన్నతాధికారులు వర్చువల్ విధానంలో హాజరయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలను సమన్వయం చేసుకుంటూ పేదలకు మెరుగైన సేవలు అందించే అంశంపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు.