బొబ్బిలిలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన: ఘనంగా ప్రారంభించిన ఎమ్మెల్యే బేబీనాయన
రిపోర్టర్: GANESH BBL
స్థలం: బొబ్బిలి
విజయనగరం జిల్లా బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో మున్సిపల్ అధికారుల సహకారంతో పలు అభివృద్ధి పనులకు స్థానిక శాసనసభ్యులు ఆర్.వీ.ఎస్.కె.కె.రంగారావు మరియు బుడా చైర్మన్ తెంటు లక్ష్మునాయుడు కలిసి శంకుస్థాపనలు చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు.