స్వీడన్ అడవుల్లో కాలిపోయిన నేలకు రంగు మార్చిన మిడుతలు
రిపోర్టర్: నరేష్
స్థలం: Sweden
అడవుల్లో జరిగిన అగ్నిప్రమాదాల కారణంగా మిడుతల రంగులో వేగంగా మార్పులు వస్తున్నట్లు పరిశోధకులు ఆండర్స్ ఫోర్స్మాన్ తెలిపారు. స్వీడన్ దేశంలో కాలిన అడవి ప్రాంతాలను శాస్త్రవేత్తలు పరిశీలించారు. అక్కడ నల్లటి రంగులో ఉండే మిడుతల సంఖ్య సుమారు యాభై శాతానికి పెరిగినట్లు గుర్తించారు. కాలిన నేలలకు తగినట్లుగా ఇవి జన్యుపరంగా రంగును మార్చుకుంటున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. మొక్కలు మళ్లీ పెరిగేకొద్దీ నల్లటి మిడుతల సంఖ్య క్రమంగా తగ్గుముఖం పట్టిందని, పక్షుల నుంచి రక్షించుకోవడానికే ఇవి ఇలా మారుతున్నాయని శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.