పాలన చేతకాక చేతులెత్తేశారు: కాంగ్రెస్ సర్కార్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి నిప్పులు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ఆరోపించారు. పాలన చేతకాక చేతులెత్తేసిన రేవంత్‌రెడ్డికి ప్రజలు రెండోసారి ఓటు వేయవద్దని కోరారు. కేసీఆర్ నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుకు కక్ష సాధింపుతో మరమ్మత్తులు చేయలేదని, అసెంబ్లీలో కాళేశ్వరంపై చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఆయన స్పష్టం చేశారు.