టీమిండియాకు భారీ ఊరట: కివీస్ టూర్కు బుమ్రా, పంత్ సన్నాహాలు
రిపోర్టర్: హరి
స్థలం: న్యూఢిల్లీ
న్యూజిలాండ్ తో జరిగే ప్రతిష్టాత్మక టెస్టుల సిరీస్ కు ముందు భారత జట్టుకు భారీ ఊరట లభించిందని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్ న్యూజిలాండ్ ఏ జట్టుతో జరిగే మూడో అనధికారిక టెస్ట్ మ్యాచ్ లో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయని అధికారులు తెలిపారు. పిచ్ పరిస్థితులకు అలవాటు పడేందుకు ఈ స్టార్ ఆటగాళ్లను ఇండియా ఏ జట్టు తరఫున ఆడించాలని మేనేజ్ మెంట్ నిర్ణయించిందని సమాచారం.