రాజమండ్రి రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో డ్రైవర్ అరెస్ట్
రిపోర్టర్: కిరణ్
స్థలం: తూర్పు గోదావరి
రాజమండ్రిలో జరిగిన రూ. 2 కోట్ల నగదు మాయం కేసులో విశాఖపట్నంలో డ్రైవర్ సాయిశివను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయన వద్ద నుంచి రూ. 1.11 కోట్లు, మండపేటకు చెందిన మరో వ్యక్తి వద్ద రూ. 50 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తును వేగవంతం చేసి మిగిలిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.