టెస్టుల్ లో భారీ షాక్: నంబర్ వన్ స్థానం కోల్పోయిన ఆస్ట్రేలియా

రిపోర్టర్: కిరణ్ స్థలం: కేప్ టౌన్

దక్షిణాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. కేప్ టౌన్ లో జరిగిన నిర్ణయాత్మక మ్యాచ్ లో ఓటమితో ఆసీస్ జట్టు టెస్టుల్ లో నంబర్ వన్ స్థానాన్ని కోల్పోయింది. ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ జాబితాలో మూడో స్థానానికి పడిపోయినట్లు ఐసీసీ అధికారులు వెల్లడించారు. ఈ చారిత్రక విజయంపై సఫారీ కెప్టెన్ టెంబా బవుమా అత్యంత ఆనందం వ్యక్తం చేశారు.