స్వర్ణగిరి క్షేత్రంలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీవారి నిత్య సేవలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: భువనగిరి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి శ్రీ వేంకటేశ్వర స్వామివారి దివ్యక్షేత్రంలో బుధవారం నిత్య సేవలు భక్తిశ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. సుప్రభాత సేవతో ప్రారంభమైన ఆధ్యాత్మిక కార్యక్రమాలు అష్టదళ పాద పద్మారాధన సహస్రనామార్చన నిత్య కళ్యాణోత్సవం తిరువీధి ఉత్సవం దీపాలంకరణ సేవలతో భక్తులను పరవశింపజేశాయి.