పర్యావరణ పరిరక్షణకై మట్టి గణపతుల పూజకు అధికారుల పిలుపు
రిపోర్టర్: K.Shekhar
స్థలం: రాజాపేట
యాదాద్రి భువనగిరి జిల్లా రాజపేట పోలీస్ స్టేషన్ పరిధిలో పర్యావరణ పరిరక్షణను కాపాడేందుకు ఎస్ఐ తఖియుద్దిన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డిఎస్పి శ్రీనివాస్ నాయుడు చేతుల మీదుగా స్థానిక ప్రజలకు, ఉత్సవ నిర్వాహకులకు ఉచితంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశారు. రసాయన విగ్రహాల వల్ల పర్యావరణానికి జరిగే హానిని నివారించేందుకు ప్రతి ఒక్కరూ మట్టి గణపతులనే పూజించాలని అధికారులు అవగాహన కల్పించారు. పర్యావరణహిత వేడుకలతో గ్రామీణ ప్రాంతాల్లో పచ్చదనం, పరిశుభ్రత కాపాడాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.