బీఆర్ఎస్ నేతల భూముల కొనుగోళ్లపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ

రిపోర్టర్: రాజేష్ స్థలం: తెలంగాణ

మాజీ సీఎం కేసీఆర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలు కొనుగోలు చేసిన భూములపై విచారణ జరిపేందుకు తెలంగాణ ప్రభుత్వం సీనియర్ ఐఏఎస్ అధికారిణి ఏ.శ్రీదేవసేన అధ్యక్షతన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసింది. ఎర్రవల్లి, జన్వాడ తదితర ప్రాంతాల్లోని భూముల క్రమవిక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలు, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై ఈ కమిటీ లోతైన దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది.