పట్టభద్రుల ఓటు హక్కుపై జనసేన అవగాహన: ఎమ్మెల్సీ ఎన్నికలపై ప్రత్యేక ప్రచారం
రిపోర్టర్: సతీష్
స్థలం: సూర్యాపేట
డబ్బులు, పదవుల కోసం కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థలో పట్టభద్రుల ఓటు హక్ కు ఎంతో కీలకమని, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవాలని జనసేన పార్టీ ఎమ్మెల్సీ ఎన్నికల కోఆర్డినేటర్ సరికొప్పుల నాగేశ్వరరావు కోరారు. పాలకవీడు మండలంలోని జాన్పహాడ్ దర్గాలో గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్ వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన, పార్టీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా యువతను చైతన్యవంతం చేస్తూ విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.