బైక్ టాక్సీ కంపెనీలకు షాక్: ఈవీలుగా మార్చాలని మహారాష్ట్ర సర్కార్ ఆదేశం

రిపోర్టర్: అశోక్ స్థలం: ముంబై

మహారాష్ట్రలో బైక్ టాక్సీల నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కార్యాలయం స్పష్టం చేసింది. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి ఆపరేటర్లు తమ పెట్రోల్ బైక్ టాక్సీలను పూర్తిగా ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చాలని ఆదేశించారు. కాలుష్య నివారణే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. దీనికోసం కంపెనీలకు ఆరు నెలల గడువు విధించగా, తాత్కాలిక లైసెన్సులు ఉన్నవారికి మరో మూడు నెలల అదనపు సమయం లభించనుందని అధికారులు వెల్లడించారు.