స్థానిక ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేయాలి: ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
స్థానిక సంస్థల ఎన్నికల్లో అభివృద్ధికి ఓటు వేసి అవినీతిని తరిమికొట్టాలని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడారు. తెదేపా హయాంలో జరిగిన అభివృద్ధిని, వైకాపా పాలనలోని అక్రమాలను బేరీజు వేసుకోవాలని కోరారు. దుర్మార్గులకు ఓటు వేస్తారా మంచివారిని ఎన్నుకుంటారా అనేది ఓటర్లే నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు. గ్రామాల మరింత అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.