విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సీజేఐ తీవ్ర ఆగ్రహం

రిపోర్టర్: రాజేష్ స్థలం: న్యూఢిల్లీ

జంతర్ మంతర్ నిరసనలో పాల్గొన్న గ్రేటర్ నోయిడా విద్యార్థికి నోటీసు జారీ చేయడంపై భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ తీవ్ర ఆశ్చర్యం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ఎలాంటి శిక్షా చర్యలు తీసుకోకూడదని స్పష్టమైన ఉత్తర్వులు ఉన్నప్పటికీ మేజిస్ట్రేట్ ఎలా నోటీసు ఇస్తారని ప్రశ్నించారు. ఈ ఘటనపై వివరణ కోరతామని సీజేఐ స్పష్టం చేశారు.