పాలమూరు రాజకీయాల్లో పెరుగుతున్న వేడి ప్రభుత్వ తీరుపై గులాబీ నేతల సమరశంకం
రిపోర్టర్: సురేష్
స్థలం: మహబూబ్నగర్
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలై నిరాశలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ నాయకులు, మాజీ మంత్రులు మరియు మాజీ ఎమ్మెల్యేలు ఇప్పుడు మౌనం వీడి ప్రజా సమస్యలపై పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు. మరోవైపు అధికార కాంగ్రెస్ పార్టీ తమ పట్టును నిలుపుకునేందుకు ప్రయత్నిస్తుండటంతో, ఉమ్మడి పాలమూరు జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య రాజకీయం రసవత్తరంగా మారుతోంది.