రూపాయి తొంభై తొమ్మిది మద్యం విక్రయాల్లో అధికారుల కనుసన్నల్లో భారీ అక్రమాలు

రిపోర్టర్: రాము స్థలం: విజయనగరం

సామాన్య మందుబాబులకు తక్కువ ధరకు మద్యం అందించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి విరుద్ధంగా శృంగవరపుకోట ప్రాంతంలో భారీ అక్రమాలు జరుగుతున్నాయని, చీప్ లిక్కర్ విక్రయాల పేరుతో లైసెన్సుదారులు నెలకు రూ.4.60 కోట్లు దోచుకుంటున్నారని స్థానిక వార్తలు వెల్లడించాయి. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా దుకాణదారులు సిండికేట్గా మారి గొలుసు దుకాణాలకు మద్యం తరలిస్తూ రూ.99 సీసాను రూ.150కి అమ్ముతున్నారని, ఎక్సైజ్ అధికారుల పర్యవేక్షణ లోపం వల్లే ఈ దోపిడీ సాగుతోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.