జాతీయ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థిని పోతిరెడ్డి వర్షిత

రిపోర్టర్: భాస్కర్ స్థలం: భద్రాద్రి కొత్తగూడెం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం రుద్రంపూర్ జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న పోతిరెడ్డి వర్షిత 39వ సబ్ జూనియర్ జాతీయ సాఫ్ట్‌బాల్ ఛాంపియన్‌షిప్ పోటీలకు ఎంపికైంది. ఈ నెల 27 నుండి 30వ తేదీ వరకు మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో జరుగనున్న ఈ టోర్నమెంట్‌లో ఆమె పాల్గొననుంది. నిరుపేద కుటుంబానికి చెందిన వర్షిత క్రీడా ప్రతిభను ప్రోత్సహించడానికి దాతలు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కోరారు.