రాష్ట్రంలో సంజీవని ప్రాజెక్టు ప్రారంభమన్న మంత్రి సత్యకుమార్
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా వచ్చే జనవరి మొదటి తేదీ నుంచి సంజీవని ప్రాజెక్టును పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. కుప్పం నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్ట్‌గా విజయం సాధించిన ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తున్నట్లు తెలిపారు. 104 వాహనాలను ఆరోగ్య రథాలుగా మార్చి నూటఒక రకమైన ల్యాబ్ పరీక్షలను ఉచితంగా అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.